టాలీవుడ్ సినిమా చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న కాంబో పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి కాంబో. వీరిద్దరి కాంబో లో సిని మా చూడాలని అభిమానుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వీరి కాంబినేషన్ లోని సినిమా పోస్ట్ పోన్ అవుతూ రాగా ఇప్పుడు వీరిద్దరి పోకడ చూస్తుంటే భవిష్యత్తులో కూడా వీరి కాంబో సెట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.

రాజమౌళి ప్రస్తుతం కేవలం పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అందులోనూ యంగ్ హీరోలు ఆయనను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ తో రాజమౌళి సినిమా చేయలేడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరింత బిజీ అవడం ఖాయం.

ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు వరకు ఆయన కొన్ని సినిమాలను చేయాలని భావించి వాటిలో రాజమౌళి సినిమా లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. ఇప్పుడు మహేష్ తర్వాత అయినా రాజమౌళి పవన్ తో సినిమా చేస్తాడా అని ఆలోచిస్తుండగా మహేష్ తో సినిమా మొదలు పెడితే తప్పకుండా 2,3 ఏళ్ల దాకా ఆయన ఫ్రీ అవడు.. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు రావడం పవన్ కళ్యాణ్ ఆ విధంగా బిజీ అవ్వడం చూస్తుంటే కాంబినేషన్ సెట్ అవడం అతి కష్టం అని చెప్పవచ్చు. ఇన్నాళ్లు భవిష్యత్తులో తప్పకుండా వీరిద్దరి కాంబో సెట్ అవుతుంది అని అనుకున్న అభిమానులకు ఇది పెద్ద నిరాశాజనకమైన విషయమని చెప్పవచ్చు. మరి వీరి కాంబో ఏవిధంగా ఎప్పుడు ఎలా సెట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: