రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం జనవరి 7 వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ మరియు ఒలివియా మోరీస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు కథానాయకుడు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్ లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

పాన్ ఇండియా సినిమాగా ఈ తెలుగు చిత్రం దేశ వ్యాప్తం గా భారీ స్థాయిలో విడుదల కాబోతుండగా తెలుగువారి సినిమా కావడంతో తెలుగునాట ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాలకు దేశంలోనే భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి ప్రేక్షకులలో. అయితే దక్షిణాదిన పోల్చుకుంటే ఉత్తరాదిన ఈ సినిమా పై కాస్త క్రేజ్ తక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి కారణం లేకపోలేదు అదే సమయానికి ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదల కాబోతుండడంతో వారి ఫోకస్ అంతా కూడా ఆ సినిమా పైనే ఉంది. దాంతో ఆర్ఆఫ్ఆర్ సినిమా ను వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ప్రభాస్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది రాజమౌళినే. కానీ అలాంటి రాజమౌళి సినిమా వదిలిపెట్టి ఉత్తరాది వారు ప్రభాస్ సినిమా కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపటం ఇప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆ సీజన్ లో మరొక రెండు భారీ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR