అయితే అటు సారా టెండూల్కర్ మాత్రం ఇప్పటివరకు ఏ రంగంలోకి అడుగు పెట్టలేదు. కానీ అటు గత కొంత కాలం నుంచి మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ తో సరదాగా సోషల్ మీడియాలో సంభాషించడం తో వీరిద్దరూ రిలేషన్ షిప్ ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇక ఈ వార్తలపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించక పోవడం గమనార్హం. ఇటీవలే సారా టెండూల్కర్ సింగర్ కనికా కపూర్ తో నైట్ డేట్ కు వెళ్లడం మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇకపోతే మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో సారా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే సారా టెండూల్కర్ ఇక ప్రస్తుతం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్‌కు ఆమె మోడల్ గా వ్యవహరించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను వీడియోను ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది సారా టెండూల్కర్. ఇక ఇందులో భాగంగా నటి బనిత సందు, తానియా శ్రాఫ్‌తో కలిసి సారా టెండూల్కర్ ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసింది. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ మోడలింగ్ లో బాగా రాణించాలని ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.