కరోనా మహమ్మారి తో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదికి పైగా సినిమా థియేటర్లు షూటింగ్ లు అన్నీ నిలిపివేయబడినవి. దీంతో దర్శక నిర్మాతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారు. ఇక మెల్ల మెల్లగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లో ఒక్కొక్కటిగా సినిమాలు సందడి చేయడం మొదలుపెట్టాయి. సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలైన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. ఆ సమయంలో బాక్సాఫీస్వద్ద విడుదలైంది నాగచైతన్య 'లవ్ స్టోరీ' సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

సెకండ్ వేవ్ తర్వాత జనాలను థియేటర్స్ కి రప్పించి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త వెలుగులు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో మిగతా సినిమాల నిర్మాతలు కూడా థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఇక నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా గా లవ్ స్టోరీ చిత్రం సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను అందుకుంది. విడుదలైన మొదటి రోజు ఓవర్సీస్ లో ఈ సినిమా..

హాఫ్ మిలియన్ మార్క్ని అందుకని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 10 కోట్ల వసూళ్లను అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమకే కొత్త ఊపు తీసుకొచ్చి 2021 సంవత్సరానికి గాను కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న చిత్రంగా లవ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకి 32 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలను అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి బూస్ట్ అందిస్తూ2021 బ్లాక్ బస్టర్ సినిమాలు లిస్ట్ లో ఒకటిగా చేరింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: