బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై సుమారు 70 కోట్ల బడ్జెట్ తో రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన స్టార్ హీరో సినిమా ఇదే కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా ఫలితం కోసం చిత్రపరిశ్రమ మొత్తం ఎదురు చూసింది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి. అందుకు ఈ సినిమా కలెక్షన్స్ నిదర్శనం.

 ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా 18 కోట్ల వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫలితంగా 2021 వ సంవత్సరం లోనే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా అఖండ నిలిచింది. మరోవైపు కరోనా మహమ్మారి తో జనాలు థియేటర్కి రావడం తగ్గించేశారు. కానీ అఖండ సినిమా మాత్రం ఆడియన్స్ అందరిని థియేటర్స్ కు రప్పించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో కూడా ఎక్కడ చూసినా థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డు లే కనిపిస్తున్నాయి. దీంతో ఆ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది.ఈ సినిమా మరి కొన్ని పెద్ద సినిమాలకు దిశా నిర్దేశాన్ని చూపించింది.

సినిమా విజయంతో తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంది. మరోవైపు బాలకృష్ణ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కూడా అఖండ కావడం విశేషం. ఇక ఓవర్సీస్లో మొదటి రోజే ఈ సినిమా లవ్ స్టోరీ,వకీల్ సాబ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఓవర్సీస్ లోనే ఈ సినిమా భారీ వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదలైన ఐదు రోజులకే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల షేర్ ని రాబట్టి చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంగా 2021 సంవత్సరం లో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల అన్నింటిలోనూ అఖండ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: