కరోనా కోరలు చాచి ప్రపంచాన్నే గడగడలాడించిన వేళ అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడా బాగా దెబ్బతింది. థియేటర్లు ఏకంగా 9 నెలలపాటు మూతపడ్డాయి. అటువంటి తరుణంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో థియేటర్ల ఓపెనింగ్ కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. అనుమతి అయితే లభించింది, స్టార్ హీరోల చిత్రాలు సైతం విడుదలకు రెడీగా ఉన్నాయి. కానీ ఈ కరోనా సందేహంతో జనాలు మళ్ళీ థియేటర్లకు వస్తారా అనుమానంతో చిత్ర సీమ చాలా ఆందోళన చెందింది. ఏదైతే అది అయ్యింది, వెనక్కి వెళ్ళే మార్గం లేదు అనుకుని సినిమాలు రిలీజ్ చేయగా ప్రేక్షక అభిమానులు సినిమాలపై తమకున్న మక్కువను మరోసారి నిరూపించి ఇండస్ట్రీకి అండగా నిలిచారు.

2021 లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవ్వగా కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.  ఆ వరుసలో ముందుగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్  'వకీల్ సాబ్' మూవీ గురించే, కరోనా పాండమిక్ సమయంలో  రిలీజ్ అయిన ఈ సినిమాకి జేజేలు పలుకుతూ సూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన క్రాక్ సినిమా కిరాక్ అనిపించుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. క్రేజీ యాంకర్ ప్రదీప్ నటించిన 'ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.


మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'ఉప్పెన' సినిమా అయితే రికార్డులు తిరగరాసింది. బాల నటుడిగా ఇండస్ట్రీ లో ఎప్పటి నుండి ఉన్న తేజ సజ్జ నటించిన తొలి చిత్రం జాంబి రెడ్డి సినిమా కూడా సక్సెస్ ను అందుకుంది. ప్రెసెంట్ కంటెంట్  కరోనా టాపిక్  తో వచ్చిన ఈ కథ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. జాతి రత్నాలు , నాంది లవ్ స్టొరీ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: