అందాల ముద్దు గుమ్మ సమంత నాగ చైతన్య తో విడాకుల తర్వాత తన సినిమాల జోరు పెంచేసింది, ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు తో బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సమంత యశ్ రాజ్ ఫిలింస్ తో ఏకంగా మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నట్టు ఇటీవల అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా లతో పాటు హాలీవుడ్ లోనూ ఒక సినిమా లో నటించబోతున్నట్లు సమంత అధికారికంగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. అలాగే తెలుగు లో  సమంత శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా లో సమంత ఒక ఐటం సాంగ్ లో కనిపించబోతోంది. ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా ఉన్న సమంత ఇటీవల శ్రీదేవి మూవీస్‌ పతాకం పై ప్రొడక్షన్ నంబర్ 14 గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాణం లో ఓ సినిమా కు సంతకం చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తాజా గా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది, సోమవారం ( డిసెంబర్‌ 6 ) పూజ కార్య క్రమాలను జరుపుకున్న ఈ సినిమా టైటిల్‌ ను యశోద గా ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ త్వర లోనే మొదలు పెట్టనున్నట్లు ఈ సందర్భం గా చిత్ర బృందం పేర్కొన్నారు. కొత్త డైరెక్షర్ లు హరి, హరీశ్‌లు దర్శకత్వం లో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్‌ సినిమా కు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా కు సంబంధించిన మిగతా నటీ నటులు ఇతర తారాగణం గురించి మరి కొన్ని రోజుల్లో తెలియ జేస్తాము అని చిత్ర బృందం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: