ఎన్నో రోజుల నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్న బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. 19 మందితో బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కాగా ప్రస్తుతం ఆరు మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో కొనసాగుతున్నారు. ఇక వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఇక టాప్ ఫైవ్ లో నిలిచే కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లకు ఓట్లు వేసి మద్దతు తెలుపుతున్నారు. ఇక పోతే ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం నిర్వాహకులు ఇస్తున్న టాస్కులు మరింత ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నాయ్ అని చెప్పాలి.



 అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు ఉన్న ఇంటి సభ్యులు అందరూ ఎలా ప్రవర్తించారో ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు అన్న విషయాన్ని ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యులు తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న ఆరు మంది కంటెస్టెంట్స్ మొత్తం గెటప్ చేంజ్ చేశారు. ఇటీవలే బిగ్బాస్ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఈ రోజు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పక్క అంటూ కామెంట్లు పెడుతూ ఉండటం గమనార్హం.



ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా.. ఆరుగురు కంటెస్టెంట్స్ మిగతా కంటెస్టెంట్ యొక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ఏకంగా వాళ్ళ లాగానే అచ్చం డ్రెస్సింగ్ కూడా వేసుకుంటారు. ఈ క్రమంలోనే సన్నీ సిరి పాత్రలోకి వెళ్ళిపోతాడు. ఇక మానస్ పింకీ పాత్రలోకి వెళ్ళిపోతాడు. ఇలావీరందరూ ఎంతో కామెడీ టైమింగ్ తో డైలాగులు చెబుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా  ఇటీవలే విడుదలైన ప్రోమో లో సన్నీ చేసే కామెడీ అయితే అందరిని ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: