ఈత‌రం ద‌ర్శ‌కుల‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకొని మొద‌టి సినిమా నుంచే స‌క్సెస్ సాధించుకుంటూ.. స‌క్సెస్ రూటులోనే సాగిపోతున్నారు ద‌ర్శ‌కులు సురేంద‌ర్‌రెడ్డి. త‌న తొలిచిత్రం నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తో అత‌నొక్క‌డే చిత్రాన్ని తెర‌కెక్కించారు సురేంద‌ర్‌రెడ్డి. తొలి చిత్రం అత‌నొక్క‌డే నుండి మొన్న మెగాస్టార్ చిరంజీవితో తీసిన సైరా న‌రసింహారెడ్డి వ‌ర‌కు తాను ప్ర‌తీ సినిమాలో ఓ కొత్త‌ద‌నం చూపించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు సురేంద‌ర్‌రెడ్డి.

1975 డిసెంబ‌ర్ 07న క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌గిత్యాల మండ‌లం మాచంప‌ల్లి గ్రామంలో సురేంద‌ర్‌రెడ్డి జ‌న్మించారు. వీరి తండ్రి వీరారెడ్డి గ్రామానికి స‌ర్పంచ్‌గా ప‌ని చేసారు. సురేంద‌ర్ రెడ్డి చిన్న‌ప్ప‌టి నుంచే సినిమాలు అంటే ఎంతో ఆస‌క్తి. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఘ‌ర్ష‌ణ‌,  రామ్‌గోపాల్ వ‌ర్మ శివ సినిమాలు ఆయ‌న‌ను సినిమారంగం వైపు మ‌ళ్లించాయి అని ప‌లుమార్లు పేర్కొన్నారు సురేంద‌ర్‌రెడ్డి. డిగ్రీ చ‌దువుతూ ఆపేసి.. హైద‌రాబాద్ కొన్ని సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, ర‌చ‌యిత‌గా ప‌ని చేసారు. తొలుత క్రాంతికుమార్ వ‌ద్ద అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఆ త‌రువాత తానే సొంతంగా అత‌నొక్క‌డే స‌బ్జెక్టు త‌యారు చేసుకున.. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌కు వినిపించారు. క‌ల్యాణ్ నిర్మాత‌గా ఆ చిత్రాన్ని నిర్మిస్తూ న‌టించారు. ఈ చిత్రంలో సురేంద‌ర్‌రెడ్డి టేకింగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్న‌ది.

 క‌ళ్యాణ్‌రామ్‌కు తొలి హిట్‌గా అత‌నొక్క‌డే నిలిచిన‌ది. మొద‌టి సినిమాతోనే విజ‌యం సాధించిన సురేంద‌ర్‌రెడ్డికి మంచి అవ‌కాశాలే ల‌భించాయి. రెండో చిత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ తో తెర‌కెక్కించే ఛాన్స్ ద‌క్కింది. ఎన్టీఆర్‌తో అశోక్‌, ఆ త‌రువాత మ‌హేష్‌బాబుతో అతిథి రూపొందించారు సురేంద‌ర్‌రెడ్డి.
ఆ తరువాత ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన కిక్ ఘ‌ట‌న విజ‌య‌మే సాధించిన‌ది. మ‌ర‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఊస‌ర‌వెల్లి రూపొందించిన సురేంద‌ర్‌రెడ్డి ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయిన‌ది. ఇక స్టైల్ స్టార్ అల్లుఅర్జున్‌తో సురేంద‌ర్‌రెడ్డి తెర‌కెక్కించిన రేసుగుర్రం బంఫ‌ర్ హిట్ సాధించినది. సినిమాలు విజ‌యం, అప‌జ‌యం అలా ప‌క్క‌కు పెడితే.. సురేంద‌ర్‌రెడ్డి సినిమాను తెర‌కెక్కించే విధానం.. కాన్సెప్ట్‌లు కొత్తద‌నం ఉంటాయి.

ర‌వితేజ హీరోగా కిక్‌-2 చిత్రాన్ని త‌న తొలి నిర్మాత క‌ల్యాణ్‌రామ్ నిర్మించ‌గా.. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఆ సినిమా కొంత‌మేర‌కే ఆక‌ట్టుకున్న‌ది. అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయిన‌ది. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాదించిన త‌ని ఒరువ‌న్ ఆధారంగా రామ్‌చ‌ర‌న్‌తో ధువ రూపొందించారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి. ఈ చిత్రం స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్ సురేంద‌ర్‌రెడ్డికి మంచి అనుబంధం కుదిరింది. దీంతో త‌న తండ్రి చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తున్న చారిత్ర‌క చిత్రం సైరా న‌ర్సింహారెడ్డికి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కునిగా ఎంచుకున్నారు రామ్‌చ‌ర‌ణ్. మెగాస్టార్‌తో తీసిన సైరాకు ద‌ర్శ‌కునిగా సురేంద‌ర్ రెడ్డి మంచి మార్కులే సంపాదించారు. ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ చిత్రం తెర‌కెక్కిస్తున్నారు సురేంద‌ర్‌రెడ్డి. ఈ చిత్రంతోనైనా సురేంద‌ర్‌రెడ్డి జనాల‌కు ఏవిధంగా అల‌రిస్తాడో వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: