2021 సంవత్సరం ఎంతో మంది హీరోలకు కలిసొచ్చింది. ఏకంగా ఈ సంవత్సరంలో ఇది ఎంతో మంది స్టార్ హీరోలు సూపర్ డూపర్ హిట్ లను ఖాతాలో వేసుకున్నారు. ఇలాంటి హీరోలలో తమిళ హీరో సూర్య కూడా ఒకరు. గత కొంతకాలం నుంచి బయోపిక్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు హీరో సూర్య. పలువురు ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో నటిస్తూ తన నటనతో రక్తి కట్టిస్తున్నారు. అంతేకాదు వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.


 ఇక ఇటీవల ఈ ఏడాది కూడా హీరో సూర్య ఒక అదిరి పోయే బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. చంద్రు అనే లాయర్ కెరియర్లో ఎదురైన ఒక విభిన్నమైన  కేస్ ఆధారం గా తెరకెక్కిన  జై భీమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. గిరిజనుల  బ్రతుకులు ఎంత దారుణంగా ఉండేవి ఎంతటి వివక్షకు గురయ్యారు అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు.



 ఇక ఈ సినిమా ఒక సాదా  సీదా సినిమా గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్ లో కాకుండా ఓటిటీ వేదికగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా అటు ప్రేక్షకుల పై ఎంతగానో ప్రభావం చూపింది అని చెప్పాలి. ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. గిరిజనులు ఇంతటి దారుణ మైన వివక్షను ఎదుర్కొంటున్నారా అని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేల చేసింది. ఇలా జై భీమ్ సినిమా ఒకవైపు హీరో సూర్యకు మంచి విజయాన్ని అందించడమే కాదు మరోవైపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు మనసును కదిలించి సూర్యను అభిమానించేలా చేసింది. జై భీమ్ సినిమాలో లాయర్ చంద్రు  పాత్రలో సూర్య నటన పాత్రకు ప్రాణం పోసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: