హీరో కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో తాజాగా రాబోతున్న చిత్రం బింబిసార. ఈ సినిమా టైటిల్ వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్టులు తో పాటుగా ఒక టీజర్ ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉండడంతో.. ఈ బింబిసార ఎవరా అంటూ నెటిజన్లు గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట్ కు కూడా ఇది ఫస్ట్ సినిమానే. కానీ విడుదలైన టీజర్ కు మాత్రం మంచి విశేష స్పందన లభించింది.

మూవీ స్టోరీ ఎంత పునర్జన్మల నేపథ్యంలో ఉన్నది కనుక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతటి ప్రాచుర్యం ఉన్న కథలో కళ్యాణ్ రామ్ చేసేటువంటి యుద్ధ విన్యాసాలు ఆయన అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా కనిపిస్తున్నాయి. ఈ మూవీలో  కేథరిన్ హీరోయిన్ గా  నటిస్తోంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం.

ఇక అసలు విషయంలోకి వెళితే.. ఏ సినిమా స్టోరీ ఎలా వచ్చిందంటే మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశీయుడైన బింబిసారుడు అనే వ్యక్తి కథ ఆధారంగా ఇది రూపొందిస్తున్నారట. ఈయన 558 లో జన్మించారు. అతి చిన్న వయసులోనే సింహాసనాన్ని సాధించారు. అంతేకాకుండా మగధ రాజ్యాన్ని మొదటగా రాజధాని చేసుకుని, అటు తరువాత పాట్నా నీ రాజధానిగా చేసుకొని ఈయన పాలించే వారట.

అయితే బింబిసారుడు అలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్ని రాజ్యాలను పాలించాడు తన మరణం ఎలా వచ్చింది అనే విషయాలపై ఈ సినిమాలో క్లుప్తంగా చూపించడం జరుగుతుందట. ఇక అంతే కాకుండా ఈయన ఏ మతం వారు కూడా స్పష్టత లేనందువలన.. ఈయనని ఏ మతస్థుడీగా నైన భావిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: