టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన అల్లుడు శీను సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ హీరో కు కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు, ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఈ హీరో 'అల్లుడు అదుర్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ వైపు దృష్టి పెట్టాడు, ఇందులో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన చత్రపతి సినిమా రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు, v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ కు కూడా ఇది బాలీవుడ్ లో మొదటి సినిమానే,  ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి చిత్ర బృందం సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకు ముందుగా చత్రపతి అనే టైటిల్ ని చిత్ర బృందం కన్ఫామ్ చేసింది,  కాకపోతే ఈ టైటిల్ ను వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవడంతో శివాజీ అనే టైటిల్ ను పెడదామని చిత్ర బృందం అనుకున్నారు. కాక పోతే ఆ టైటిల్ ను కూడా వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్,  వి వి వినాయక్ సినిమాకు సమస్య మొదలైంది. ప్రస్తుతం దర్శకుడు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ చత్రపతి టైటిల్ గురించి వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారట, అయితే వారు ఆ టైటిల్ కోసం రెండు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఈ మూవీ కి చత్రపతి టైటిల్ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో చిత్ర బృందం ఆలోచనలో పడ్డాడట, మరి చిత్ర బృందం రెండు కోట్ల రూపాయలు ఇచ్చి చత్రపతి టైటిల్ దక్కించుకుంటారా.?  రాలేక వేరే టైటిల్ ను కాయం చేసుకొని ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: