ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే తర్వాత సినిమాతో హిట్ కొట్టి ట్రాక్  లోకి వచ్చె మహేష్ బాబు ఇప్పుడు అభిమానుల విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రెండు సినిమాలతో బిజీగా ఉండగా వ్యాపార రంగంలో కూడా కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది మహేష్ బాబు నటించిన సినిమా కమర్షియల్ గా మహేష్ బాబుది పెద్దగా కలిసి రాకపోయినా సరే ఇప్పుడు నటిస్తున్న సినిమా మాత్రం కమర్షియల్ గా ఒక రేంజ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు అని అదే విధంగా కొంతమంది స్టార్ హీరోలతో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు అని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల విడుదలైన బాలకృష్ణ సినిమాకు సంబంధించి మహేష్ బాబు తన సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించడం కాకుండా సినిమాను ప్రత్యేకంగా చూసి అభినందించడం మాత్రం బాలకృష్ణ అభిమానులను సంతోష పెట్టింది. ఇక మహేష్ బాబు ఇప్పుడు అభిమానుల కోసం కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు అని త్వరలోనే అభిమానులకు స్మాల్ గిఫ్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. క్రిస్మస్ కానుకగా తన సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలతో ఒక వీడియో ని రూపొందించి దానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది

ప్రస్తుతం దీనికి సంబంధించి మహేష్బాబు వర్కౌట్ చేస్తున్నాడని ఒక ప్రముఖ వీడియో ఎడిటర్ దీనికి సంబంధించి బాధ్యతలు తీసుకున్నారని నమ్రత పర్యవేక్షణలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సమాచారం.ఇక మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధం కాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా టీం తో కూడా మహేష్ బాబు ఎప్పటికప్పుడు చర్చలు జరపడం సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా అభిమానులు లోకి వేగంగా తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: