ఈ సంవత్సరం మొదట్లో కరోనా పీరియడ్ ఒక వైపు కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ అటువంటి సమయంలో కూడా థియేటర్లు రీ ఓపెన్ అయ్యి పునర్వైభవం పొందాయి. ఈ ఏడాది 2021 విడుదలైన దాదాపు అన్ని చిత్రాలు విజయాన్ని అందుకోగా కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇపుడు 2021 లో రికార్డులు బ్రేక్ చేసిన టాలీవుడ్ స్టార్స్ సినిమాలు ఏమిటో చూద్దాం పదండి.

* తాజాగా విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేసిన 'అఖండ' మూవీ విజయ పతాకం ఎగురవేస్తోంది. రికార్డ్ స్ధాయిలో కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా రూపుదిద్దిన ఈ చిత్రం భారీ వసూళ్ళను కురిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ చేసిన యాక్షన్ పట్ల సర్వత్రా ప్రసంశలు కురుస్తున్నాయి.

* డెబ్యూ హీరోగా వెండి తెరకు పరిచయమయిన వైష్ణవి తేజ్ తొలి చిత్రం 'ఉప్పెన' సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. కథలో కొత్తదనంతో డైరెక్టర్ బుచ్చిబాబు తొలి సినిమా తోనే ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో నటించిన కృతి శెట్టి కి అయితే ఇపుడు ఆఫర్ లు చుట్టుముట్టాయి అని చెప్పాలి.

* 8 ఏళ్లుగా సరైన విజయం అందక నిరాశలో ఉన్న హీరో అల్లరి నరేష్ కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ హీరో నటించిన 'నాంది' సినిమా కాసుల వర్షం కురిపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఎప్పుడూ కామెడీ జోనర్ నే ఎంచుకునే నరేష్ ఈసారి సరికొత్త కథను సెలెక్ట్ చేసుకుని వెళ్ళాడు. ఇక ఈ సినిమా కథకు కనెక్ట్ కాని ప్రేక్షకుడు లేరంటే నమ్మండి.

ఇలా ఈ ఏడాది ఎన్నో సినిమాలు థియేటర్లో విడుదల అయ్యి విజయాన్ని అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: