ఎన్నో రోజుల నుంచి బుల్లితెర ప్రేక్షకుల అందరినీ ఆకర్షిస్తున్న బిగ్బాస్ కార్యక్రమం ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే బిగ్బాస్ కార్యక్రమంలో ప్రస్తుతం కేవలం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే కొనసాగుతున్నారు.  ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్స్ అందరూ వెళ్లిపోవడంతో హౌస్ మొత్తం ఖాళీ గా మారిపోయింది. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆరు మంది కంటెస్టెంట్స్ తమదైన శైలిలో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నారు.


 ఇకపోతే ఇటీవల హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన పాత్రలను ఇతర కంటెస్టెంట్స్ పోషించాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా సాగిపోతుంది అని చెప్పాలి.  కంటెస్టెంట్స్ పాత్రలో అదర కొడుతూ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న పింకీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మానస్ తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ పంచాడు. ఇక ఈ రోజు మానస్ పింకీ లకు సంబంధించిన పాత్రలు వేయాలని బిగ్బాస్ ఆదేశించారు.


 దీంతో తాను పింకీ పాత్ర వేస్తాను అంటూ సన్నీ చెప్పగా నేను మానస్ పాత్ర చేస్తాను అంటూ కాజల్ చెబుతోంది. ఈ క్రమంలోనే సన్నీ ఏకంగా లంగా వోనీ వేసుకున్న ఎంట్రీ ఇస్తాడు. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సన్నీ ని చూసిన తర్వాత అరేయ్ ఏంట్రా ఇది పింకీ ఇలా ఉంది ఏంట్రా అంటూ షణ్ముఖ్ జోక్ వేస్తాడు. దీంతో అందరూ ఎంతగానో నవ్వుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో కష్ట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: