టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప'. ఆర్య, ఆర్య 2 వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక రంగస్థలం సినిమాలో అలాగే ఈ సినిమాని కూడా భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అల్లుఅర్జున్ తో పాటు రష్మిక మందన, పాహాద్ పజిల్, సునీల్, అనసూయ, కన్నడ నటుడు ధనుంజయ, అజయ్ ఘోష్, రావు రమేష్, అజయ్ ఇంకా చాలా మంది నటీనటులు పుష్ప ట్రైలర్ లో కనిపించారు. అయితే ఈ ట్రైలర్ మొత్తంలో అనసూయ లుక్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

ట్రైలర్ ను సరిగ్గా గమనిస్తే.. నోట్లో బ్లేడ్ పెట్టుకొని మంగళం శ్రీను పాత్రను పోషిస్తున్న సునీల్ నీ ఆమె బెదిరిస్తున్న విజువల్ ట్రైలర్ లో ఉంది. దీంతో సినిమాలో అనసూయ పాత్ర అసలు ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఫిలిం సర్కిల్ నుంచి వినిపిస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో అనసూయ.. దాక్షాయిని అనే నెగిటివ్ షేడ్ కలిగిన పాత్రలో చాలా భయంకరంగా కనిపిస్తుందట. ఇక ఆమె వేషధారణ అమ్మోరు స్టైల్ లో పెద్ద బొట్టు, మెడలో నగలు, చేతికి ఉంగరాలు వేసుకొని, నోట్లో కిళ్ళీ పెట్టుకొని గట్టిగా అరుస్తూ పెత్తనం చెలాయించే ఓ పెద్దింటి మహిళగా కనిపించబోతోందట ఈ జబర్దస్త్ బ్యూటీ.

 ఇక ఈ పాత్ర గతంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో రాశి పాత్రను పోలి ఉంటుందట. అంతే కాదు ఈ సినిమాలో ఆమె పాత్ర కు సంబంధించి ఓ భారీ ట్విస్ట్ కూడా ఉండబోతుందట. ఆ సీన్ కి థియేటర్ లో మాత్రం విజిల్స్ పడటం ఖాయం అని అంటున్నారు. ఇప్పటివరకు ఎంతో గ్లామరస్గా కనిపించే అనసూయ మొదటి సారి ఇలాంటి ఒక క్రూరమైన పాత్రలో నటించబోతోంది. మరి ఈ పాత్రకి అనసూయ ఎలాంటి న్యాయం చేస్తుందో చేసిందో తెలియాలంటే డిసెంబర్ 17 వరకు ఆగాల్సిందే. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: