1985-90 ల మధ్య రాజశేఖర్ సినిమాలు అన్నీ వరస హిట్స్. ఆరోజులలో రాజశేఖర్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. దీనితో అతడు చిరంజీవికి గట్టి పోటీ ఇస్తాడా అన్న సందేహాలు కూడ వచ్చాయి. ఆతరువాత రాజశేఖర్ సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లు అతడి సినిమాలకు బయ్యర్లు కూడ కరువయ్యారు.


తిరిగి ఇప్పుడు మళ్ళీ ‘గరుడవేగ’ సక్సస్ తరువాత రాజశేఖర్ మళ్ళీ నిలదోక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిస్థితుల మధ్య అతడు లేటెస్ట్ గా నటిస్తున్న శేఖర్ మూవీ పై అంచనాలు బాగున్నాయి. ఒక మళయాళ మూవీ రీమేక్ గా తీయబడిన ఈమూవీకి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తే జీవిత నిర్మించింది.


విడుదలకు రెడీగా ఉన్న ఈమూవీ ఎప్పుడు విడుదల చేయాలోతెలియక సతమతమౌతున్న పరిస్థితులలో ఈమూవీకి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ దరిదాపు 30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం రాజశేఖర్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే ఇది మంచి ఫ్యాన్సీ రేటు అన్నమాటలు వినిపిస్తున్నాయి. దీనితో జీవిత ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్.


మూవీ రీమేక్ అయినప్పటికీ కథ స్క్రీన్ ప్లేలో చాల మార్పుచేర్పులు చేశారు అని అంటున్నారు. ఈ మూవీలో ఒక  సర్ ప్రైజ్ కూడా ఉంటుంది అంటున్నారు. ఈ మూవీకి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన కథలో మార్పులు స్క్రీన్ ప్లే జీవిత చూసుకుంది అని అంటారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఈ మూవీకి హైలెట్ గా మారుతాయి అంటున్నారు. ఓటీటీ లో విడుదల కాబోతున్న ఈమూవీ ఓటీటీ ప్రేక్షకులకు బాగా నచ్చితే ఒక వెబ్ సిరీస్ ను సొంతంగా నిర్మించే ఆలోచన కూడ జీవితకు ఉంది అని అంటారు. దీనితో ఈమూవీ ఎంతవరకు రాజశేఖర్ కు సక్సస్ ను ఇస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: