విజయ్ సేతుపతి ఇప్పుడు పలు భాషలలో పలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఈయన సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమాకు మంచి విశేష స్పందన లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల లో సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. తెలుగులో శంభో శివ శంభో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.. ఇక ఈ సినిమాతో ఆయన ఎంత పెద్ద క్రేజ్ సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈయన ఏకంగా ప్రస్తుతం 15 సినిమాలకు పని చేస్తూ బిజీగా గడుపుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇకపోతే నవంబర్ 2వ తేదీన మైసూర్ విమానాశ్రయంలో విజయ్ సేతుపతి కి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేయి చేసుకున్నారనే వీడియో కూడా వైరల్ గా మారింది.. ఆ తరువాత దాడి జరిగింది విజయ్ సేతుపతి పై కాదు పక్కనున్న వ్యక్తి పైన కామెంట్లు వినిపించాయి.. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం కొత్త మలుపు తీసుకోవడమే కాకుండా ఆయన పై పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా మూడు కోట్ల రూపాయలు పరువునష్టం వేశారు.

ఇక ఆరోజు మైసూరు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి అతని అసిస్టెంట్లు చెన్నైకి చెందిన మహా గాంధీ అనే వ్యక్తి ని కొట్టారు అనే వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి ని కలిసి అతని నటనను మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉండగా విజయ్ సేతుపతి సిబ్బంది వచ్చి అతనిపై దాడి చేసినట్లు మహా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్ట్ ను కూడా ఆశ్రయించాడు. అంతేకాదు ఫిజికల్ గా, మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి అలాగే ఆయన సిబ్బంది లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని నిశ్చయించుకున్నారు అట అయితే మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: