అల్లుడు శీను సినిమా తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే దర్శకుడితో కలిసి చత్రపతి రీమేక్ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఆయన నటించి న తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆలోచిస్తుండగా తనకు వచ్చే స్పందనను గమనించిన కొండ శ్రీనివాస్ డైరెక్ట్ గా హిందీ చిత్రం చేయాలని భావించి ఈ భారీ చిత్రాన్ని ఎక్కడ రీమేక్ చేయడానికి ముందుకు వచ్చాడు.

దీనికి సరైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కు వినాయక్ సమాధానం గా కనిపించ గా ఆయన మాస్ సినిమాలను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అయిన వినాయక్ చత్రపతి లాంటి భారీ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకు ల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించాలి అంటే అది వి.వి.వినాయక్ మాత్రమే సాధ్యం. ఆ విధంగా ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు ఉండగా ఇప్పుడు చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ సినిమా.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో తర్జనభర్జనలు పడుతుందట చిత్ర యూనిట్. చత్రపతి సినిమా అంటే తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టైటిల్ విషయం లో ఎంతో జాగ్రత్త వహి స్తూ దానికి తగ్గ పవర్ ఫుల్ టైటిల్ ను నిర్ణయం చేయాలి. అలాంటిది ఇప్పుడు కొత్తగా చిత్ర యూనిట్ కి టైటిల్ దొరక్కపోవడం తో వారు ఈ సినిమా ఏం టైటిల్ పెట్టాలని తెగ తర్జన భర్జనలు పడుతున్నారు. చత్రపతి అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: