నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకొని భారీ కలెక్షన్లను సాధిస్తుంది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలకృష్ణ చేసిన మూడవ చిత్రం కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ నటన హైలెట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వం హైలెట్ గా ఉందని మొదటినుంచి చెబుతున్నారు. దానికి తోడు తమన్ సంగీతం కూడా అదిరిపోయేలా ఉందని ప్రేక్షకులు సైతం చెబుతున్నారు.

ఆ విధంగా ఈ సినిమా లో ఈ ముగ్గురు తమ తమ పాత్రలను అద్భుతంగా నిర్వహించగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా కూడా ఈ సినిమా విజయంలో చాలా వరకు పాలుపంచుకుందని చెప్పవచ్చు. కంచె సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రగ్యా. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే నటనను కనబరిచి హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వస్తాయని భావించారు. భావించినట్లుగా అనే ఆమెకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. 

సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఆమెకు కంచె సినిమా లాగా బ్రేక్ ఇచ్చే మఱొక సినిమా మాత్రం రావడం లేదనే చెప్పాలి. దాంతో బాలకృష్ణ తో నటించిన అఖండ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రగ్యా జైస్వాల్. ఆమె ఆశలను నిజం చేస్తూ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి తనకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈమెకు పవర్ స్టార్ సరసన నటించే అవకాశాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాలో కూడా ఈమెను హీరోయిన్ గా పెట్టుకోవాలని భావిస్తున్నారు. మరి ఆమె కెరియర్ ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: