అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకుని వారి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఏది ఏమైనా ఇప్పుడు వీరిద్దరు కలిసి లేరు అని నిజాన్ని ప్రతి ఒక్కరు జీర్నించుకోక తప్పదు. విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే వీరిద్దరు తమ క్రియలను ప్లాన్ చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య వరసగా ఆయన చేసే సినిమాలు చేసుకుంటూ పోతూ ఉండగా సమంత కూడా తను చేస్తున్న చేయబోతున్న సినిమాలను లైన్ లో పెట్టుకొని ఫుల్ బిజీగా మారిపోయింది. 

ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత ఇటీవలే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నట్లు గా ప్రకటించింది. అది ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే ఆమె యశోద అనే మరొక పాన్ ఇండియా సినిమా ను అనౌన్స్ చేసి తను ఏ విధంగా  సినిమాలు చేస్తున్నానో అని చాటి చెప్పింది. అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా ఆమె నటించే విధంగా ప్రణాళికలు వేసుకుని దూసుకెళ్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె ఫ్యామిలీ మెన్ 2 అనే ఓ వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ లో ఆమె నటించిన తీరు కు భారీగా ప్రశంసలు దక్కాయి.

ఈ నేపథ్యంలోనే పలు భారీ వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థలు ఆమెను సంప్రదిస్తున్నట్లు గా తెలుస్తున్నాయి. ఏదేమైనా విడాకుల తర్వాత ఆమె కెరీర్ దాదాపు అయిపోయింది అని అనుకున్న వారందరూ కూడా ఇప్పుడు ఆమె వరుస ప్రాజెక్టులు చేయడం ఒక్కసారిగా ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది. పెళ్లి తర్వాత మామూలుగా అందరు హీరోయిన్ లు సినిమాలను చేయరు కానీ పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా ఆమె సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: