ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత ఇటీవలే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నట్లు గా ప్రకటించింది. అది ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే ఆమె యశోద అనే మరొక పాన్ ఇండియా సినిమా ను అనౌన్స్ చేసి తను ఏ విధంగా సినిమాలు చేస్తున్నానో అని చాటి చెప్పింది. అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా ఆమె నటించే విధంగా ప్రణాళికలు వేసుకుని దూసుకెళ్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె ఫ్యామిలీ మెన్ 2 అనే ఓ వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ లో ఆమె నటించిన తీరు కు భారీగా ప్రశంసలు దక్కాయి.
ఈ నేపథ్యంలోనే పలు భారీ వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థలు ఆమెను సంప్రదిస్తున్నట్లు గా తెలుస్తున్నాయి. ఏదేమైనా విడాకుల తర్వాత ఆమె కెరీర్ దాదాపు అయిపోయింది అని అనుకున్న వారందరూ కూడా ఇప్పుడు ఆమె వరుస ప్రాజెక్టులు చేయడం ఒక్కసారిగా ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది. పెళ్లి తర్వాత మామూలుగా అందరు హీరోయిన్ లు సినిమాలను చేయరు కానీ పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా ఆమె సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.