బోయపాటి శీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఆ సినిమా అఖండ విజయాన్ని అందుకుంటుందని వారి కాంబినేషన్లో ఇప్పటివరకూ తెరకెక్కిన మూడు సినిమాలనే ఉదాహరణ గా చెప్పొచ్చు. 2010వ సంవత్సరంలో తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్ లో సింహ అనే చిత్రం రాగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద గొప్ప గొప్ప రికార్డులను తిరగరాసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా సృష్టించిన కొన్ని రికార్డులను ఇప్పటికీ ఏ సినిమా కూడా తుడిచి పెట్ట లేకపోయింది. ఆ తర్వాత 2014వ సంవత్సరంలో వీరి కాంబో లో మరొక సినిమా వచ్చింది.

సింహ సినిమా ఇచ్చిన విజయాన్ని మించిన రేంజ్ లో హిట్ కొట్టాలని లెజెండ్ సినిమా చేయగా ఈ చిత్రంతో మరో భారీ హిట్ అందుకున్నారు ఈ ఇద్దరూ. నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో మూడోసారి అనగానే రెండు సినిమాలకు మించిన పవర్ ప్యాక్డ్ సినిమాను ప్రేక్షకులకు అందించాలని భావించి అఖండ అనే ఓ వెరైటీ స్టోరీ తయారు చేసి దాన్ని అద్భుతంగా తెరకెక్కించి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సూపర్ హిట్ సాధించారు. బాలకృష్ణ తో సినిమా అనగానే బోయపాటి శ్రీను కు పూనకం వచ్చేస్తుందేమో అనే పేరు తెచ్చుకున్నాడు.

తన సినిమాలలో బాలయ్య ను పవర్ఫుల్ గా చూపిస్తూ ఆయన తో సినిమాలు చేసే బోయపాటి శీను ఆయనతో సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరి చేస్తాడు. అలా సినిమాలు చేసి ఇద్దరికి సూపర్ హిట్ వచ్చేలా చేసుకుంటాడు. అలా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా అఖండ సినిమా వచ్చి అఖండ విజయం సాధించింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబినేషన్లో నాలుగో సినిమా కూడా ఉంటుందని బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కంప్లీట్ చేసి ఆ నాలుగో సినిమాను తెరకెక్కిచబోతున్నాడు అని అంటున్నారు. బోయపాటి శ్రీను కూడా అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాను ఈ లోపు పూర్తి చేస్తాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: