సక్సెస్ ఉన్న దర్శకుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటాడు. పెద్ద హీరోలు సైతం సక్సెస్ ఉన్న దర్శకుడు తో సినిమా చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఆ విధంగా ఇప్పుడు అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను తో సినిమా చేయాలని చాలా మంది పెద్ద హీరోలు ఆయనను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. దీనికి ముందు ఆయన రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని నెలకొల్పాడు.

దాంతో ఈ సారి తప్పకుండా అఖండ విజయాన్ని అందుకోవాలని చెప్పి బాలకృష్ణతో కలిసి అఖండ సినిమా చేయగా అది భారీ స్థాయిలో హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయనకు పెద్ద హీరోల దగ్గర నుంచి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి ఆయనకు కబురు వచ్చింది అంటే ఏ స్థాయిలో బోయపాటి విజయాన్ని అందుకున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అవి వచ్చే ఏడాది నాటికి షూటింగ్ లతో సహా పూర్తవుతాయి.

ఈ నేపథ్యంలోనే అయన తన తదుపరి చిత్రాన్ని బోయపాటి తో చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రాగానే వెంటనే ఆయనకు కబురు పెట్టాడట. ఓ మంచి కథ కూడా రెడీ చేయమని కూడా చెప్పాడట. దాంతో ఆ మెగా పనులలో ఉన్న బోయపాటి శీను మరోవైపు అల్లు అర్జున్ తో సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. మరి బోయపాటి శ్రీను బాలకృష్ణ తో మరో సినిమా కూడా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దర్శకుడు ఎవరి తో సినిమా చేస్తాడా అనేది చూడాలి. గతంలోనే బోయపాటి శ్రీను మరియు మెగాస్టార్ చిరంజీవి ల కాంబో లో సినిమా రావాల్సి ఉండగా అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. మరి ఇప్పుడు ఆ చిత్రం తెరకెక్కుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: