సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో,హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒక పని చేసే ముందు నాలుగు సార్లు ఆలోచించాలి. లేకపోతే నెట్టింట వాళ్ళ పరువును వాళ్ళే తీసుకున్నట్లవుతుంది. ఇప్పుడు పంజాబీ భామ పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా అలాగే చేసింది. తనకు సంబంధించిన ఫోటోలను తానే పోస్ట్ చేసి నెట్టింట పెద్ద దుమారానికి తెర లేపింది.

హీరోయిన్స్ హాట్ గా కనిపించాలి..అప్పుడే అవకాశాలు వస్తాయి అనుకునే వారు ఒక్కసారి మన పాత కాలంలో ఉండే హీరోయిన్స్ ని చూడండి. నిండైన దుస్తులతో కనిపిస్తారు. చక్కగా నటిస్తారు. వల్గారిటికి పోకుండా పద్ధతిగా  నటిస్తూనే ఎన్నో అవార్డులు సైతం దక్కించుకున్నారు. మరి వాళ్లకు ఎక్స్ పోజింగ్ చేయకపోయిన మంచి మంచి అవకాశాలు వచ్చాయి కదా. ఈ విషయం గుర్తు పెట్టుకుని ఈతరం హీరోయిన్స్ నడుచుకుంటే అసలు ఈ తలనొప్పులు పడే బాధే రాదు కదా.

సినిమాలో అవకాశాల కోసమో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ పాయల్ ఒపెన్‌ టాప్‌ తో  ఫోటో షూట్‌ చేసి నెట్టింట  ట్రోల్స్‌ కు గురి అవుతుంది.  ఒపెన్‌ టాప్‌తో ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి చేదు అనుభవం ఎదుర్కొంది ఈ బోల్డ్‌ హాట్ బ్యూటీ. ఒపెన్‌ టాప్‌ తో  ఫోటో షూట్‌ చేసిన ఈ భామ కొన్ని హాట్ ఫోటోలను  ‘బి హైండ్ ది సీన్స్’ అంటూ హాట్ గా ఉండే ఓ  వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో చెప్పుకోలేనంత అత్యంత అసభ్యకరంగా పాయల్ ఫోటోలు ఉండడంతో నెటిజన్స్ మండిపడ్డారు.
 దీంతో తేరుకుని ఆ వీడియోని డిలీట్ చేసేలోపే.. ఆ వీడియో  కొంత మంది నెటిజన్లు డౌన్‌లోడ్ చేసి నెట్టింట పాయల్ ను విపరీతంగా ట్రోల్స్ చేస్తునారు. దీంతో పాయల్ రెస్పాండ్ అవుతూ" అందరి ఆడవాళ్ల దగ్గర ఏముందో అదే నా దగ్గర ఉంది. చిన్న దానికి అంత రాద్ధాంతం చేయకండి"..అంటూ బోల్డ్ గా కౌంటర్ ఇచ్చింది ట్రోలర్స్ కు. దీంతో అమ్మడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: