తెలుగు సినిమా లో కొంతమంది హీరోలు ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొంత మంది స్టార్ హీరోలు వాళ్లకు అన్ని విధాలుగా సహాయం చేసే విధంగా ముందుకు అడుగులు వేయడం కాస్త శుభ పరిణామంగా చెప్తున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం చిన్న చిన్న హీరోలు కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కాస్త కొంత మంది స్టార్ హీరోలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని తమ స్నేహాన్ని గుర్తు పెట్టుకొని సలహాలు సూచనలు ఇస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే శర్వానంద్ విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.

శర్వానంద్ అని తన సినిమాల్లో కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కొరటాల శివ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాలో సోదరుడి పాత్ర ఇవ్వడం లేదా నెగిటివ్ పాత్ర ఏదైనా ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడని దీనికి సంబంధించి ఇప్పటికే కొరటాల శివతో కూడా చర్చలు జరిపారని అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా శర్వానంద్ కి ఒక మంచి పాత్ర ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడని అలాగే కొంతమంది ప్రముఖ దర్శకులతో కూడా మాట్లాడి అతని కెరీర్ కు సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తున్నారని అంటున్నారు.

చిరంజీవి కూడా శర్వానంద్ సినిమాలకు సంబంధించి కాస్త ఎక్కువగా జ్యోక్యం చేసుకోవడమే కాకుండా కొంత మంది దర్శకులకు అతని గురించి చెప్పడం అదే విధంగా అతనికి కూడా సినిమా ఏ విధంగా ఉండాలి ఏంటి సినిమాలో ఏ సన్నివేశాలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది చెబుతున్నారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే మెగా ఫ్యామిలీ శర్వానంద్ కెరీర్ విషయంలో దృష్టి పెట్టడం అతను ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కెరీర్ గాడిలో పెట్టేందుకు కష్టపడటం మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: