కానీ అఖండ సినిమా ఎలా ఉంది అని ప్రతి ప్రేక్షకుడు.. అంటే సినిమా చూసిన వాడు మరియు సినిమా చూడని వాడు అడుగుతున్నాడట. అయితే, అందరూ చెబుతున్న మాట ఏమిటంటే సినిమాలో కథ లేదు అని. నిజంగానే కథ లేదట. అఖండ అనే బలమైన పాత్ర మాత్రమే ఉందని తెలుస్తుంది.
ఇక గొప్ప కథలు మరియు అద్భుత కథనాలు సినిమాలో లేవని ఈ విషయంలో బోయపాటిని అభినందించాలని తెలుస్తుంది.. చెత్త కథలు, సుత్తి కథలు తీసి పైత్యం చూపించకుండా ఏదో ఓ మంచి పాత్రను రాసుకుని ఆ పాత్రనే నమ్ముకుని సినిమా తీసుకున్నాడట.. పైగా బాలయ్య బాబు చేత ఆయన వయసుకు తగ్గట్టు ఆయన ఆహర్యానికి తగ్గ సినిమా తీసి హిట్ కొట్టాడని తెలుస్తుంది.
కాకపోతే కొన్ని రోత సన్నివేశాలు లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నా కూడా ప్రస్తుతం దరిదాపుల్లో ఏ కొత్త సినిమా లేకపోడం అఖండకు బాగా కలిసి వచ్చిందట.అఘోరాగా బాలయ్యకి మేకప్ బాగా సూట్ అయిందదని ముఖ్యంగా హైందవం - దేవాలయం - సన్యాసం - శివుని తత్వం వెరసి చిన్న ఆధ్యాత్మికత భావన కల్పించే ప్రయత్నం చేశారట..
కథకు తగ్గ హీరోయిన్లు పాటలు మరి కావాలి కాబట్టి, కాస్త పరిధి దాటారని తెలుస్తుంది.దీనివల్ల మాస్ ఆడియన్స్ కూడా సినిమాని ఇష్టపడ్డారట. అయితే, సినిమాలో అందరికీ బాగా కనెక్ట్ అయింది మాత్రం, సాధువు ధర్మం అలాగే అఘోరాల కర్తవ్యమే. కళ్ళు మూసి తపస్సు చేయడం కాదు - దేవాలయాలు - దేవుడు జోలికి వస్తే తొక్క తీస్తాం అనేలా ఉందట బాలయ్య నటన.
ఎందుకో ఆ ధార్మిక సంభాషణకి కళ్ళు చెమ్మగిల్లాయని తెలుస్తుంది.కాకపోతే, చాలా సినిమాలలో చూపినట్లే జపమాలను మాత్రం జపించడం తప్పుగానే చూపించారట.. ఇక లెజెండ్ - సింహా లాగానే ఒకే తరహా డైలాగులు ఉన్నా రైటర్ ని మెచ్చుకోవాల్సిందేనని తెలుస్తుంది.