తెలుగు సినిమాలో వారసుల గురించి ఈ మధ్య కాలంలో మళ్లీ చర్చలు కాస్త గట్టిగానే జరుగుతున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కుమారుడు గురించి తెలుగు సినిమా లో చర్చలు జరగడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. వీళ్లిద్దరు సినిమాల్లోకి వచ్చే అంశానికి సంబంధించి కొంత మంది పెద్దల సలహాలు కూడా తీసుకుంటున్నారని అలాగే వారి వారి తండ్రులు కూడా కాస్త ఎక్కువగా దృష్టి పెడతారని ప్రధానంగా నందమూరి బాలకృష్ణ తన కొడుకును ఎలా అయినాసరే సినిమాకు పరిచయం చేయాలనే తపన లో ఉన్నారని వారసత్వాన్ని నిలబెట్టేందుకు కాస్త గట్టిగానే కష్ట పెడుతున్నారు అని అంటున్నారు.

అయితే నందమూరి మోక్షజ్ఞ మాత్రం సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కానీ బాలకృష్ణ మాత్రం ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని దీనికి సంబంధించి ఒక యాక్టింగ్ స్కూల్లో కూడా శిక్షణ ఇప్పించేందుకు కాస్త ఆయన ప్రయత్నం చేస్తున్నా సరే సతీమణి వసుంధర నుంచి సహకారం రావడం లేదని అంటున్నారు. బాలకృష్ణ కుమారుడు సినిమాల్లోకి రావాలి అంటే కచ్చితంగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాల్సి ఉన్నా సరే ఆయన ఇప్పటివరకు ఎటువంటి విధంగా కూడా ప్రయత్నం చేయడం లేదని ఈ విషయంలో బాలకృష్ణ కాస్త అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలకృష్ణ తన వారసుని తీసుకు రావాలి అంటే కచ్చితంగా ఒక కమర్షియల్ దర్శకుడి చేతిలో పెట్టాల్సిన అవసరం ఉంది అనే మాట వాస్తవం. అయితే మోక్షజ్ఞ అంతగా ఆసక్తి చూపించకపోవడం తో బాలకృష్ణ ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాల కంటే కూడా వ్యాపార రంగం మీద ఆసక్తి కరం గా ఉన్నారని ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తో కూడా చర్చించారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: