ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కన్ను కూడా బిగ్బాస్ కార్యక్రమము పైనే ఉంది. సాధారణంగా బుల్లితెరపై సినీ సెలబ్రిటీ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతుంది బిగ్ బాస్. ఈ కార్యక్రమం వస్తుంది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు. మనకు తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్ లను గెలిపించుకునేందుకు ప్రతివారం కూడా ఓట్లు వేసి ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లను ఎలిమినేషన్ నుండి  తప్పిస్తూ ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అయి పోతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్ లతో ఈ బిగ్బాస్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం హౌస్ లో ఆరు మంది కంటెస్టెంట్స్ మాత్రమే కొనసాగుతున్నారు. ఇక ఈ 6 మంది లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు టాప్ 5 లో నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ రోల్ ప్లే గేమ్ ఆడిస్తూ ఉండగా ఇంటి నుంచి బయటకు వెళ్లినా తోటి ఇంటి సభ్యుల పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నవ్వులు పూయిస్తున్నారు ఇంట్లో ఉన్న సభ్యులు. ఇప్పటికే ప్రియాంక పాత్రనూ రీ క్రియేట్ చేసి కడుపుబ్బా నవ్వించాడు సన్నీ.


 ఇంటి నుంచి బయటకు వెళ్లిన హమీద పాత్రను కూడా రీక్రియేట్ చేసి శ్రీరామ్ వద్దకు వెళ్లి ఎంతో కామెడీ క్రియేట్ చేశాడు సన్నీ. అయితే ఇటీవలే సిరి షణ్ముక్ మధ్య గొడవ జరిగింది అన్న విషయం తెలిసిందే.. ఈ గొడవ మరింత పెద్దదిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఏకంగా షణ్ముక్ సిరి పై మాటల యుద్ధమే చేశాడు. అవతల వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఫ్రెండుకు ఇవ్వవు.. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్ అంటూ ఎంతో కోపంగా విరుచుకుపడ్డాడు షణ్ముక్.  నువ్వు ఎవరికో ఎమోషనల్గా కనెక్ట్ అయితే నేను ఆపాను. నిన్ను ఎవరో అప్పడం అంటే నేను ఎదురు తిరిగాను.. మీ మదర్ వచ్చి అందరి ముందు హాగ్ గురించి మాట్లాడారు ఈ మొత్తం వ్యవహారంలో నేను నెగిటివ్ అయ్యాను ఇక్కడి నుంచి వెళ్ళిపో.  మిగతా సభ్యులు ఎలాగో నువ్వు కూడా అలాగే అంటూ షణ్ముఖ్ కోపంతో ఊగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: