సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ ఫిట్నెస్ పైనే దృష్టి పెడుతూ ఉంటారు. సినిమా సినిమాకు తమని తాము కొత్తగా చూపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కాస్త సమయం దొరికింది అంటే చాలు జిమ్ లో కసరత్తులు చేయడానికే నేటి రోజుల్లో హీరోహీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు మాత్రమే ఫిట్నెస్ గురించి ఆలోచించే వారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలోని సీనియర్లు సైతం బరువు తగ్గడం పై ఎక్కువగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది సీనియర్ నటీనటులు భారీగా బరువు తగ్గుతు ఏకంగా ఈ రోజుల్లో యూత్ కి సవాల్ విసురుతున్నారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో సహజ నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది జయసుధ. జయసుధ అంటే కాస్త బొద్దుగా ఎంతో సంప్రదాయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవలే జయసుధ ఏకంగా ఎంతో సన్నగా మారింది. ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఫిట్నెస్ పెంచుకోవడం కోసం బరువు తగ్గాను అంటూ సోషల్ మీడియాలో తెలిపింది. జయసుధ ఫోటో చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.




 ఇక ఇటీవలే ఏకంగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సైతం బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా ఏకంగా 20 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించింది ఖుష్బూ. తన జీవితంలో ఎన్నడూ లేనంత ఫిట్ గా ఇప్పుడు కనిపిస్తున్నాను అంటూ ఇటీవల కామెంట్ చేసింది. అదే సమయంలో తమిళ్ హీరో ప్రభు కూడా బాగా బరువు తగ్గి కొత్త లుక్ లోకి మారిపోయారు. ఏకంగా ప్రభు కూడా 20 కేజీల వరకు బరువు తగ్గడం గమనార్హం. అయితే పొన్నియన్ సెల్వన్ అనే సినిమా కోసమే హీరో ప్రభు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సీనియర్లు మాత్రం ప్రస్తుతం తగ్గేదేలా అంటూ ముందుకు సాగుతూ బరువు తగ్గి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: