ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరోయిన్ గా కొన సాగుతుంది సమంత. అయితే అందం అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అభిమానులందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. అక్కి నేని హీరో నాగ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది సమంత. తెలుగు చిత్ర పరిశ్రమ లో నాగ  చైతన్య సమంత దంపతులకు ఎంత గానో క్రేజ్ ఉంది. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు.


 ఇక మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కూడా గుర్తింపు సంపాదించిన ఈ ఇద్దరు విడాకులు తీసు కుంటున్నట్లు ప్రకటించడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సమంత నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నది మాత్రం ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఒక చిక్కు ప్రశ్నగానే మిగిలి పోయింది. విడాకులు తీసు కుంటున్నట్లు ప్రకటించిన తర్వాత వీరిద్దరూ విడాకులు అంశంపై ఎక్కడా ప్రస్తావించ లేదు. కానీ ఇటీవలే విడాకుల తర్వాత రియల్ లైఫ్ గురించి పలు విషయాల ను ఒక సెలబ్రిటీ చిట్ చాట్  కార్యక్రమం లో తెలిపింది సమంత.



 2021 సంవత్సరం లో నా కలలన్నీ చెదిరి పోయాయి అంటూ హీరోయిన్ సమంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భం  గా సోషల్ మీడియా లో వస్తున్న ట్రోల్స్ పై కూడా స్పందించింది సమంత. అసభ్యకర కామెంట్లు తనను ఎంతగానో బాధి స్తున్నాయి అంటూ సమంత చెప్పు కొచ్చింది. వచ్చే ఏడాది పై ఎలాంటి ఆశలు పెట్టు   కోలేదు అంటూ చెప్పు కొచ్చింది. నాకోసం కాలం ఏది నిర్ణయిస్తే దానిని  ధైర్యం గా స్వీకరించేందుకు  సిద్ధం గా ఉన్నాను అంటూ సమంత తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి సమంత  ఎమోషనల్ కామెంట్స్ చేయడం మాత్రం హాట్ టాపిక్ గా మారి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: