అఖండ సినిమా సక్సెస్ తో నందమూరి బాలకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో బాలకృష్ణ మురళీకృష్ణ అనే పాత్రలో అందంగా, మనోహరంగా కనిపిస్తూనే అఖండ అనే మరో పాత్రలో అఘోరా లుక్ లో తన నట విశ్వరూపం చూపించాడు. ఇక సినిమాలో బాలకృష్ణ ని ఏ విధంగా చూపించాలో బోయపాటి శ్రీను కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన మూడు సినిమాల్లోనూ ఆయన అందంగా కనిపించారు. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య అందం వెనుక విగ్గు కూడా ఉందని అంటున్నారు.

 ఇక ఈ సినిమాలో బాలయ్య విగ్గు కోసమే ఏకంగా లక్షల్లో ఖర్చు పెట్టారట సినిమా మేకర్స్. ఇక ఈ సినిమాలో మేకర్స్ బాలయ్య విగ్గు కోసం దాదాపు 50 లక్షలకు పైగా ఖర్చు చేశారని సమాచారం వినిపిస్తోంది. సుమారు 39 లక్షల రూపాయలను వెచ్చించి బాలకృష్ణ కోసం మూడు విగ్గులను మేకర్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో బాలయ్య పోషించిన మురళీకృష్ణ పాత్రకు ఈ మూడు విగ్గులను ఉపయోగించడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య లుక్ కోసం ఏకంగా ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్ ను పిలిపించారట. మరి ముంబై నుంచి హెయిర్ స్టైలిష్ట్ అంటే వారి రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే బాలయ్య హెయిర్ స్టైలిస్ట్ కు ఏకంగా 12 లక్షల రూపాయలను చెల్లించారు. అలా మొత్తం మీద విగ్గులతో పాటు హెయిర్ స్టైలిస్ట్ రెమ్యునరేషన్ కలిపి యాభై లక్షలకు పైగా ఖర్చయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు అఖండ సినిమా విడుదలై వారం రోజులు కావస్తున్నా ఇంకా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా షేర్ నీ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య కెరీర్లోనే భారీ వసూళ్లను అందుకున్న చిత్రంగా ఆఖండ నిలవడం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: