పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రను పోషిస్తుండగా.. అతని సరసన పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది. ఇక ఈ ఇద్దరి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంక్రాంతి జనవరి 14న రాబోతోంది. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు మేకర్స్.

 ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విడుదలైన ఈ రాతలే, నగుమోము తారలే అనే పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే డిసెంబరు 21వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రావడం మాత్రం పక్క అని తెలుస్తోంది. ఒక డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా కథ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.

ఎదుటి వారి చేతి రేఖలు చూసి వారి భవిష్యత్ ఏంటో చెప్పగల నేర్పరి అయిన హీరో.. తన ప్రేయసి ఒక చేతి రేఖలు చూసి ఆమెకు వచ్చే ప్రమాదాలు ముందే పసిగడతాడు. ఇక ఆమెను ఆ ప్రమాదాల బారి నుండి ఎలా రక్షించుకున్నాడు అనేదే ఈ సినిమా కథ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండగా జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కానుండగా దీంతోపాటు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఈ సినిమాలకు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా పోటీ ఇస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: