మొన్నటి వరకు బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే 2017 లో కూడా టాలీవుడ్ లో సంచలనం రేపిన ఈ డ్రగ్స్ విషయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో మలుపులు , ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ దర్యాప్తు తో మొదలుపెట్టి ఎన్నో మలుపుల తర్వాత ఈడీ విచారణ వరకు వచ్చింది. కాకపోతే ఈడీ కూడా దిగుమతి నిధులపై దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు కొట్టి వేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తెలంగాణ ఆబ్కారీ పోలీసులు గత 4 సంవత్సరాల క్రితం డ్రగ్స్ సప్లయర్ అయిన  కెల్విన్ మార్కేరాన్స్ ను అరెస్ట్ చేయడంతో టాలీవుడ్లో ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. అతడిని విచారణ జరపగా అతడు ఇచ్చిన వివరాల మేరకు పలువురు టాలీవుడ్ ప్రముఖులను ఎంక్వైరీ కూడా చేశారు ఈడీ అధికారులు. సెలబ్రిటీల గోళ్ళు, తలవెంట్రుకలను కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు  పంపించారు.. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఎక్సైజ్ శాఖ క్లీన్చిట్ ఇచ్చింది.. అయితే అంతటితో ఈ డి ఊరుకోక మాదకద్రవ్యాల, క్రయవిక్రయాలలో.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అలాగే ల్యాండరింగ్ కోణంలో ఈ కేసులో ఎలాగైనా ఛేదించాలని ఈడి రంగంలోకి దిగింది.

ఈ నేపద్యం లోని ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలు అయినా పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి కౌర్, రానా దగ్గుబాటి, ముమైత్ ఖాన్ , రకుల్ ప్రీతీ సింగ్ , నవదీప్ , తరుణ్  , నందు , తనీష్ తో సహా మొత్తం 12 మందికి  నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరిగిన ఈ డ్రగ్స్ విచారణలో ప్రధాన నిందితుడు కెల్విన్ కి  ఉన్న సంబంధాల గురించి ఆర్థిక లావాదేవీల గురించి అధికారులు ఆరా తీశారు. ఈడీ అధికారులు సెలబ్రిటీల నుంచి ఒక ఆధారాన్ని కూడా సేకరించ లేకపోవడంతో కేసును క్లోజ్ చేయడానికి ఈడీ అధికారులు చట్టపరమైన ప్రక్రియ పై కసరత్తు చేస్తున్నారట.. ఇదే జరిగితే మన టాలీవుడ్ ప్రముఖులు అంతా బయట పడినట్లే.. త్వరలోనే వీరెవరికీ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదని నివేదిక ఇచ్చి  మూసివేస్తారు అని సమాచారం.. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అధికారులు కొండను తవ్వి , ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: