అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ విజయం అనూహ్యం. ఈ మాట ఎందుకు చెప్పాలీ అంటే అఖండ హిట్ అవుతుందనే అంతా అనుకున్నారు. బోయపాటి, బాలయ్యల హ్యాట్రి కాంబో కాబట్టి ఆ మెరుపులు ఉంటాయి. దాంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బొమ్మ ఆడేస్తుంది అనే అంచనా కట్టారు.

అయితే అఖండ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఏముంది అంటే చెప్పడానికి ఏమీ లేదు, అయితే ఏదో ఉంది అన్న భావన మాత్రం ఉంది. ఏముంది అంటే బాలయ్య మ్యాజిక్ ఉంది. ఆయన గెటప్ కొత్త లుక్ కట్టిపడేసెలా ఉన్నాయి. ఇక ఈ మూవీని నడిపించిన తీరు బాగుంది. లాజిక్ కి అందకుండా స్పీడ్ గా సినిమాను నడిపేసిన ట్రిక్ బోయపాటిది. అలాగే మ్యూజిక్ తో సీన్లను  ఎలివేట్ చేస్తూ ఏదో మైకంలోకి తీసుకుపోయిన ఘనత తమన్ ది.

బాలయ్య లో రౌద్ర రసం బాగా పండుతుంది. ఆయన బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నీ కూడా ఆ కోవకు చెందినవే. సమరసింహారెడ్డిగా ఆయన గర్జించినా, నరసింహ నాయుడుగా రీ సౌండ్ చేసినా, అంతకు ముందు రౌడీ ఇన్స్ పెక్టర్ అయినా, సింహా, లెజెండ్ అయినా ఆయనలో ఎమోషన్  బ్రహ్మాండంగా పండుతుంది. దాన్నే పట్టుకుని బోయపాటి మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు.

అందుకే ఈ మూవీ అదిరిపోయే హిట్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కలెక్షన్లు కూడా ఎవరూ ఊహించనివే. అందుకే ఈ మూవీలో నటించిన నటుడు జగపతిబాబు అంటున్నారు. ఇది అఖండ వైరస్ అని. కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని ఊపేసినట్లుగానే అఖండ వైరస్ సినీ ప్రియులను ఊపేస్తోంది అని.  ఈ మూవీ విషయంలో రెండవ మాట లేదని కూడా చెప్పేశారు.మరి ఇంతకీ అఖండ ఫీవర్ అయినా వైరస్ అయినా ఇప్పట్లో ఆగేట్టూ తగ్గేట్లూ లేదన్నది ట్రేడ్ పండితుల మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: