హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నారు. కారణాలు ఏవైనా కూడా ఒకప్పుడు తెలుగు సినిమా హాస్య ప్రపంచాన్ని శాసించిన బ్రహ్మానందం కు సినిమా అవకాశాలు రాకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. దాంతో కొంత టైమ్ తీసుకుని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలని బ్రహ్మానందం భావించగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా ఆ టైం రావట్లేదని ఎంతగానో బాధ పడుతున్నారు ఆయన అభిమానులు.

ఒకప్పుడు ఆయన ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా నవ్వులు పువ్వులు పూయించేది. అంతేకాదు ఆయన లేనిదే ఏ సినిమా కూడా పూర్తి అయ్యేది కాదు. ప్రేక్షకులకి కూడా ఏదో ఒక విధంగా అది అసంతృప్తినే మిగిల్చేది. ఆయన లేకుండా ఏ సినిమా కూడా మేకర్స్ కి సంతృప్తిని ఇచ్చేది కాదు. అయితే ఆ మధ్య బ్రహ్మానందం తన సినిమా  కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడని కొన్ని రోజులు వార్తలు రాగా అదేమీ కాదని కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నారు అని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజులు గడుస్తున్నా కూడా ఆయనకు సినిమాలు రాకపోవడం అందరినీ ఎంతగానో కలవరపెట్టింది. 

ఇక ప్రస్తుతం ఆయనకు వచ్చిన సినిమా అవకాశాలను చూస్తుంటే మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆయనకు ఇప్పుడు సినిమా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నట్లుగా తెలుస్తుంది. యంగ్ హీరోలు కొంతమంది నటించే సినిమాల్లో ఆయనకు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ సినిమాలు కనుక వర్కౌట్ అయితే తప్పకుండా ఆయన గతంలోలా మళ్లీ సినిమా అవకాశాలు అందుకోవడం ఖాయం గా తెలుస్తుంది. హాస్య బ్రహ్మ గా కొన్ని వందల చిత్రాల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్రహ్మానందం మళ్లీ నవ్వులు పోయిస్తే చూడాలని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: