ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తాజాగా భారత దేశంలో ఉన్న అన్ని థియేటర్లలో చాలా ఘనంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా..? నీ గురించి అంతా తెలిసిన వాడు నీ స్నేహితుడు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇక తర్వాత రామ్ చరణ్ , ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లను కూడా మనం ఈ ట్రైలర్ లో గమనించవచ్చు. ఇక ఈ ట్రైలర్ లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతోంది.

కానీ జక్కన్న గ్రాఫిక్స్ ను వాడటంలో దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త గ్రాఫిక్స్ ను పరిచయం చేసిన జక్కన్న ఈసారి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను కనువిందు చేయడమే కాకుండా తన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక రామ్ చరణ్,  ఎన్టీఆర్ ఇద్దరూ కూడా సిక్స్ ప్యాక్ తో మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్లో శ్రీయ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇలా అందరూ కూడా కనిపించి ప్రేక్షకులకు మంచి కనువిందు ఇచ్చారు..

ఇకపోతే ఈ ట్రైలర్లో ఖచ్చితమైన విజువల్స్, సౌండ్, గ్రాఫిక్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా రావడం మనం గమనించవచ్చు. ఇక ఈ ట్రైలర్ చూసిన వారంతా జక్కన్న మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తన పేరు నిలబెట్టుకున్నాడు అంటూ రకరకాల కామెంట్లతో ముంచెత్తుతున్నారు అభిమానులు. ఇకపోతే ఈ సినిమాతో ఎన్టీఆర్ కు , రామ్ చరణ్ కు పాన్ ఇండియా లెవల్లో స్టార్ ఇమేజ్ ఖచ్చితంగా వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా థియేటర్లలో విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా ప్రసారం అవుతోంది. ఇక మీరు కూడా ఈ ట్రైలర్ ని చూసి ఆనందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: