తెలుగు సినిమాల ఈ మధ్య కాలం లో మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మల్టీస్టారర్ సినిమాల విషయంలో కొంత మంది స్టార్ హీరోలు అలాంటి చిన్న హీరోలు కాస్త ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో దర్శకులు మంచి కథను సిద్ధం చేసుకుని ముందుకు వస్తున్నారు. ఈ సినిమాల ద్వారా వసూళ్లు కూడా తెలుసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్లుగా ఈ మధ్య కాలంలో అర్థమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మల్టీస్టారర్ సినిమాల ద్వారా కాస్త టాలీవుడ్ గాడిలో పడే అవకాశం ఉంటుంది అని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం చిన్న చిన్న హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ గా ఉండగా కొంతమంది రచయితలు కూడా మంచి కథను సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని హీరో నాగచైతన్య అలాగే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇటీవల ఒక కథ కూడా సిద్ధమైందని దీనిపై ళ్యాణ్ రామ్ చాలా సానుకూలంగా ఉన్నారని పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇటువంటి క్లారిటీ లేకపోయినా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఈ సినిమాకు సంబంధించి స్టార్ హీరోయిన్ ని కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అయితే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉండవచ్చని అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ను రెడీ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడబోతుంది నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: