మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త తెలంగాణలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్ తో కొంతమంది సినీ ప్రముఖులు అత్యంత సన్నిహితంగా ఉండే ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆయనతో భేటీ అవడానికి రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు సినిమా కష్టాల్లో ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది అగ్ర హీరోలు కూడా ఆయనను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ భేటీ వెనుక ప్రధాన కారణం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవనం అనేది చాలా మంది మాట్లాడే మాట. ఈ భవనాలకు సంబంధించి బాలకృష్ణ సానుకూలంగా ఉన్నారని దాదాపుగా ఆయన కోటి రూపాయలు విరాళం ఇచ్చే అవకాశం ఉందని 2 భవనాలను నిర్మించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది సినీ కార్మికులకు పెన్షన్ ఇప్పించే విధంగా కూడా బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఆయన మంచు విష్ణుతో కలిసి సీఎం కేసీఆర్ తో  భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉండవచ్చు. బాలకృష్ణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కొన్ని కొన్ని అంశాలు ఎక్కువగా జోక్యం చేసుకోవడం అలాగే మంచు విష్ణుకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. అయితే బాలకృష్ణ ఇప్పుడు భేటీ అవుతారని ఏంటనే దానిపై ఇంకా ఇటువంటి క్లారిటీ లేకపోయినా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ కు బాలకృష్ణ ఫోన్ కూడా చేసి మాట్లాడారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr