తెలుగు సినీ పరిశ్రమపై  కోవిడ్-19 పడగ వేసిన నేపథ్యం తాలూకూ భయాందోళనలు సమసిపోక ముందే విడుదలైన చిత్రం అఖండ.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి అందగాడు బాలకృష్ణ నటించిన ఈ చిత్రం సినిమాహా తెరపై రంగుల పండుగనే చూపించింది. చెవులు పగిలే శబ్దాలు, తెల్లటి తెర నిండా రక్తపు మరకలు, చారికలతో ఆద్యంతం ఈ సినిమా  జాతరలో జరిగే రక్తపాతాన్ని తెలుగు ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసింది. 5 స్టార్ రెటింగా లో ఆఖండ చిత్రం కేవలం  1.5  రేెటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని అందరినీ నిరాశకు గురిచేసింది. అయితే  బాలకృష్ణ అభిమానులు ఊరికే ఉంటారా ?  తమ నాయకుడిపై ఉన్న అభిమానంతో ఈ సినిమానే పదే పదే చూసి కలెక్షన్ లు భారీగా  వచ్చాయనిపించారు.
దీంతో  ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విశాఖపట్టణంలో ఈ చిత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.  ఈ  సందర్భంగా చిత్ర  కథనాయకుడిగా నటించిన నందమూరి అందగాడు బాలకృష్ణ తన ప్రసంగంతో అభిమానులు ఆకట్టుకున్నారు. కా అదే సందర్భంగా ఆయన తన దర్శకుడు బోయపాటి గురించి  చేసిన ప్రస్తావన పొగిడారా ? లెక తిట్టారా ? అన్నట్లుగా సాగీందని సినీ విమర్శకులు  తలలు పట్టుకు కూర్చున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. బోయాపాటికి తనకు మధ్య. మంచి అండర్ స్టాండింగ్ ఉంది అని చెబుతూనే బాలకృష్ణ బోయపాటి పై తన అక్కసు వెల్లగక్కుకున్నారు.  సింహ,. లెజెండ్ తరువాత బోయపాటి తో ఈ  చిత్రం చేస్తున్న సమయంలో తనకు భయమేసిందని చెప్పారు. అశేష సినీ అభిమానులు తమ కాంబినేషన్  పై ఎక్కువ అశలు పెట్టుకున్న నేపథ్యంలో తాను ఒకింత ఉద్వేగానికి గురయ్యానని బాలకృష్ణ తెలిపారు. అయితే బోయపాటి ఎప్పుడు కూడా సినిమా కథను తనకు పూర్తిగా చెప్పలేదని సునిశితంగా విమర్శలు చేశారు. ఆయన మీద విశ్వాసం ఉంచి సినిమాలో నటించానని బాలకృష్ణ పేర్కోన్నారు. అభిమానులు తమపై ఉంచిన నమ్మకం ఎంతో విలువైనదని కూడా బాలకృష్ణ తన ప్రసంగంలో తెలిపారు.  నందమూరి అభిమానులు అపజయంలోనూ తన వెంట ఉన్నారని, వారి అభిమానుం వెలకట్టలేనిదని పేర్కోంటూ ఇప్పుడు కూడా అభిమానగణం తన వెంట ఉండటం తనకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తున్నదని బాలకృష్ణ పేర్కోన్నారు. ధియేటర్ లో బోయపాటి రచ్చ రచ్చ చేయించారని కూడా బాల  కృష్ణ తన ప్రసంగంలో పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: