టాలీవుడ్ లో మరోసారి సినిమా విజయోత్సాహాలు నటుడు బాలకృష్ణ అఖండ తో ఊపుఅందుకున్నాయని అందరు భావిస్తున్నారు. కరోనా తరువాత సాధారణంగా చిత్ర పరిశ్రమలో కనిపించే భయం ఈ చిత్ర విడుదల సమయంలో కూడా ఉండొచ్చుగాక, కానీ ఆ భయాలను పటాపంచలు చేసే విధంగా ఈ చిత్రం ఉన్నట్టే కనిపిస్తుంది. దీనితో తరువాత సిద్ధంగా ఉన్న చిత్రాలు కూడా వరుసగా విడుదలకు సిద్ధం అయ్యే పరిస్థితి కనిపించవచ్చు. అయితే ఇక్కడ మరో గండం కూడా కళ్ళముందే ఉంది. అదే తాజా వేరియంట్, అది ప్రభావం చూపించకుండా ఉంటె, వచ్చే రెండు నెలలలో తెలుగు సినీ పరిశ్రమలో విడుదలకు అనేక చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అసలే సంక్రాంతి కావడంతో పందెం కోళ్లు చాలానే బరిలోకి రావడానికి ఇప్పటికే తయారయ్యి ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో కూడా అఖండను ధైర్యంగా విడుదల చేయడం అది ప్రేక్షకుల మరియు నందమూరి అబిమానులను ఆకట్టుకోవడంతో పరిశ్రమకు కాస్త ఊరట లభించినట్టే. కష్ట కాలం లో ఇలాంటి అడుగు తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలి, ఆ అడుగు వెనుక అనేక అడుగులు పడతాయి. దానికి సిద్ధం అవ్వడం దర్శక నిర్మాతల చేతిలోనే ఉంటుంది. అఖండ టీం అందుకు సిద్దపడటంతో ధైర్యే సాహసే లక్ష్మి అన్నది మరోసారి నిజం అయినట్టుగా ఉంది. ఇదే ఉత్సాహం బహుశా కొనసాగాలని ఆశిద్దాం. అఖండ విజయోత్సాహాలు యావత్ చిత్ర పరిశ్రమకు ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. ఇక చిత్రం గురించి చూస్తే, ఇండస్ట్రీ హిట్ మాదిరి చెప్పడానికి లేదు కానీ, ఇప్పటి పరిస్థితులలో హిట్ అని చెప్పవచ్చు.

పరిస్థితిని బట్టి కూడా హిట్ వస్తుంది అనేది మరోసారి అఖండ నిరూపించింది. కధ, దర్శక, నిర్మాతల చొరవ కూడా వాటికి కలిసి వస్తే అది ప్రేక్షకులకు ముఖ్యంగా అభిమానులకు పండగే. నేటికీ బాలకృష్ణ ఒక డైలాగ్ చెపితే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. వారందరికీ పండగ అని చాటి చెప్పేదే ఈ 'అఖండ'విజయోత్సాహం. అందుకే ఇది కేవలం సినిమా పరిశ్రమకు మాత్రమే కాదు నందమూరి అభిమానులకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇది కూడా పెద్ద చిత్రంగా పరిగణించడం జరిగింది కాబట్టి ఇతర పెద్ద చిత్రాలు విడుదల చేసుకోవచ్చు అనేది ఆయా దర్శకులకు, నిర్మాతలకు దీనిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చినట్టే. ఇలాంటి విజయోత్సాహాలు తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని జరుపుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: