నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారని అందరికి తెలుసు.

 

థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారట.. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోందని తెలుస్తుంది.దీంతో అఖండ టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసిందట.. అఖండ విజయోత్సవాలను టీమ్ విశాఖపట్నంలో నిర్వహించిందని తెలుస్తుంది.. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది.

 

ఇక అఖండ అంచనాలను మించి మొదటి రోజు దుమ్ము లేపిన అఖండ రెండో రోజు అలాగే మూడో రోజు కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది. అఖండ మూడు రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 35.4 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందట. ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే రూ. 56 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అలాగే ఈరోజు నుంచి జంట తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రెడీగా ఉందని చెబుతున్నారట.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అఖండ సినిమాను ఓవర్సీస్ మొత్తం మీద 2.5 కోట్ల రేటుకి అమ్మగా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్2తో ఈ సినిమా 2.35 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుందని అంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమా రెండో రోజు అక్కడ 1.1 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

 

అంతేకాదు అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసిందట.ఇక అమెరికాలో 575K మార్క్ ని అందుకున్న సినిమా ఈరోజుతో 600K మార్క్ ని అందుకోబోనుందని అంటున్నారట.ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని సమాచారం.

అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించిందట చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారట. ఈ చిత్రంతో దర్శకుడు రేంజ్ మారినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: