తెలుగు సినిమాలు ఈ మధ్య కాలంలో ఇతర భాషల నటులకు ప్రాధాన్యత మళ్లీ పెరుగుతుంది అనే మాట వాస్తవం. చాలా మంది ఇతర భాషల నటులను తెలుగు లో నటించడానికి ఆసక్తి చూపించటంతో మన నటులు కూడా వారిని తీసుకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న నటులు పెద్ద నటులు కూడా తెలుగులో నటించి పాపులారిటీ పొందాలని ప్రయత్నాలు చేయడం ఈ మధ్యకాలంలో జరుగుతోంది. చిన్న చిన్న హీరోలు కూడా తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేయడానికి ఇతర భాషల నుంచి రావడం కాస్త ఆశ్చర్యపరిచే విధంగా చెప్పాలి.

ప్రస్తుతం తెలుగులో అరవింద స్వామికి డిమాండ్ మళ్లీ పెరుగుతోందని అంటున్నారు. అరవింద స్వామి తెలుగులో గతంలో ఒక సినిమాలో విలన్ గా నటించగా ఆ సినిమాలో అతని పాత్ర బాగా హైలెట్ కావడమే కాకుండా హీరో కంటే కూడా డామినేట్ చేసింది అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తెలుగులో అతని కోసం చాలామంది దర్శక నిర్మాతల ఎదురు చూస్తున్నారని మెగా హీరోలు ప్రత్యేకంగా ఆయన విలన్ గా నటించడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కొరటాల శివ సినిమాలో అరవింద స్వామి ని విలన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి అరవిందస్వామి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించడానికి అరవిందస్వామి దాదాపుగా ఆరు కోట్ల వరకు డిమాండ్ చేశాడని అయినాసరే నిర్మాత ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదని త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చిత్ర యూనిట్ విడుదల చేయవచ్చని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమాకు సంబంధించి కాస్త ఇప్పుడు తెలుగు సినిమా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: