తెలుగు లో నటించడానికి ఇతర భాషల హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపించడంతో తెలుగు దర్శక నిర్మాతలు కూడా వారిని తీసుకోవడానికి ఆసక్తి కరం గా ఉన్నారు. ప్రధానంగా సూర్య సహా కొంతమంది హీరోలు తెలుగులో పూర్తి స్థాయిలో ఒక సినిమా అయినా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి దర్శక నిర్మాతలు వాళ్లను తెలుగులో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు కూడా కాస్త ఈ మధ్యకాలంలో గట్టిగానే వినపడుతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి కాస్త ప్రచారం గట్టిగానే జరుగుతూ ఉండగా ఇప్పుడు సూర్య సినిమాకు సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడు రెడీ గా ఉన్నారనే వార్తలు వినపడుతున్నాయి.

సూర్య హీరోగా సినిమాను తెరకెక్కించడానికి ప్రముఖ దర్శకుడు సురేందర్రెడ్డి సిద్ధమయ్యారని దీనికి సంబంధించిన కథ కూడా రెడీ చేస్తున్నారు అని ఒక హిందీ రీమేక్ సినిమాలు తెలుగులో సూర్య హీరోగా రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన తో పాటుగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసే అవకాశం ఉండవచ్చని టాలీవుడ్ జనాల మాట. ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ వ్యవహరిస్తారని అలాగే తమిళ నిర్మాత కూడా ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించే అవకాశాలు ఉండవచ్చు అని సినిమా వర్గాలు అంటున్నాయి.

సూర్యా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేసేందుకు గతంలో ప్రయత్నాలు చేసినా సరే అవి ఫలించకపోవడంతో ఆయన వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు సురేందర్రెడ్డి సూర్య హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రెడీ కావడంతో కాస్త ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ లేకపోయినా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సూర్య సోషల్ మీడియాలో ప్రకటన చేయవచ్చని సమాచారం.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: