అఖండ పై అభిమానేతరులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రంలో లాజిక్ లేదు, అదంతా అబుతకల్పనలు అంటూ వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. దీనితో అది అభిమానుల వరకు వెళ్లినట్టుగా ఉంది, దానితో వాళ్ళు సరైన జవాబు ఇచ్చారు. తరాలు మరికొద్ది అభిప్రాయాలు మారిపోతాయి. దానిపైనే ఇష్టాయిష్టాలు కూడా ఆధారపడతాయి. అందువలన పాతతరంలో ఉన్న వారికి నేటి తరంలో ఉన్న చిత్రాలు నచ్చకపోవడం సర్వసాధారణం. అయినా ఒక తెలుగు చిత్రం కాబట్టి ఇలా అనాలి అనిపిస్తుంది కానీ, మరో భాషా చిత్రం అయితే అబ్బా ఎంత గొప్ప సైన్స్ ఫిక్షన్ మూవీ అని గొప్పలు చెప్పుకునే వారు అని అభిమాన వర్గాలు విమర్శకులకు చెక్ పెడుతున్నారు.

ప్రతి భాష చిత్రంలో సైన్స్ ఫిక్షన్ లేదా యుద్ధ సన్నివేశాలు లేదా ఫ్యాక్షన్ లేదా కల్పితమైన అనేక భవిష్యత్తు సాంకేతికత లాంటివి ఉండొచ్చు. ఆయా చిత్రాలను కధలకు అనుగుణంగా మలచడం జరుగుతుంది. దర్శకుల ఊహాశక్తిని బట్టి, వారు తెలుసుకున్న చారిత్రాత్మక విషయాలను బట్టి వాళ్ళు ఆయా కధలను రచిస్తారు. దాని నుండి తెరపైకి వస్తాయి. అలాంటివి ఒక హాలీవుడ్ లోనో మరొక చిత్ర పరిశ్రమలోనో చుస్తే వావ్ అంటాం, మనవాడు దానికోసం కృషి చేస్తే మాత్రం అదేదో తక్కువైందే అంటూ విమర్శలు చేస్తాము. ముందు మీకు నచ్చేవి అనేవాటిపై స్పష్టత తెచ్చుకోవాలి, మీకు వయసు అయిపోయింది అనేవాటిని ఒప్పుకోవాలి, అప్పుడు మా తరం చిత్రాలు కాస్తోకూస్తో మీకూ ఎక్కుతాయి.

చిత్రాన్ని తెరపైకి తేవడానికి ఎంతమంది కష్టపడుతున్నారు, దానికోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు, ఎవరెవరు దానిని తీర్చిదిద్దుతున్నారు ఇవన్నీ అనవసరం చేతిలో శక్తి ఉందని, బుర్రలో ఆలోచన వచ్చిందని విమర్శలు చేస్తూ పోవడం సరైనదేనా అనేది వయసు పైబడిన వాళ్ళు కూడా విమర్శించుకోవాల్సిన అవసరం ఉందని మాలాంటి వారు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. బాలకృష నటించింది, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా విజయోత్సాహం జరుపుకున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్ళ తరువాతో వచ్చిన చిత్రం, అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న చిత్రం కాబట్టి దానిపై ఆయా వర్గాలలో అంచనాలు బాగానే ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఫలితం దక్కినట్టుగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: