ఈ మధ్యకాలంలో తెలుగులో మళ్లీ మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర చర్చ జరగడమే కాకుండా అగ్రహీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ గా ఉంటున్నారు. మల్టీస్టారర్ సినిమాల విషయంలో మెగా హీరోలు ఈ మధ్య కాలంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్న చిన్న హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నా సరే అవి పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో దర్శక నిర్మాతలు వాళ్ళవైపు చూడలేకపోతున్నారు. కొంతమంది పెద్ద హీరోలు మల్టీస్టారర్ సినిమాల వైపు కాస్త ఆసక్తికరంగా ఉండటంతో కొంత మంది దర్శకులు మంచి కథను సిద్ధం చేసి ముందుకు నడిపిస్తున్నారు.


మెగా హీరోల్లో ప్రధానంగా రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాల మీద ఆసక్తి కరం గా ఉన్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. రాజమౌళితో ఇప్పటికే రామ్ చరణ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న త్వరలోనే అల్లు అర్జున్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మహేష్ బాబు సినిమాలో చిరంజీవి ఒక గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉండవచ్చని  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా చిరంజీవి సినిమాకు సంబంధించి కాస్త మహేష్ బాబుతో మాట్లాడారని మహేష్ బాబు కూడా చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి రెడీ అయ్యాడని అంటున్నారు.



పరుశురామ్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ లో కనబడతారని చిరంజీవి పాత్ర ఆ సినిమాలో కచ్చితంగా హైలెట్ అవుతుందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే మల్టీస్టారర్ సినిమాల విషయంలో చిరంజీవి మెగా ఫ్యామిలీ మొత్తం ఆసక్తికరంగా ఉండడం అలాగే ఇతర హీరోల సినిమాలకు ప్రమోషన్ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో ఇతర హీరోలు కూడా మెగా హీరోల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: