తెలుగు సినిమా లో కొంతమంది దర్శక నిర్మాతల గురించి కొంత మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు అనే మాట వాస్తవం. ఇక కొరటాల శివ ఈ మధ్య కాలంలో కొంతమంది స్టార్ హీరోలకు బాగా దగ్గర కావడంతో చాలామంది స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ గా ఉండటమే కాకుండా మంచి కథలు ఉంటే మాత్రం కచ్చితంగా వాళ్లే పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. చిన్న చిన్న కథలకు సంబంధించి ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తి చూపిస్తున్న మహేష్ బాబు కొరటాల శివ రాసిన ఏ కథ అయినా సరే ఖచ్చితంగా సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు.

కొరటాల శివ రాశి కథలకు సంబంధించి చాలామంది స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో ఆసక్తికరంగా ఉండటంతో నిర్మాతలు కూడా వారి వారి సినిమాలకు సంబంధించి కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా చేయడానికి మహేష్ బాబు కాస్త సానుకూలంగా ఉన్నారని గతంలో మహేష్ బాబు ఆయనతో చేసిన సినిమాలు విజయం సాధించిన నేపథ్యంలో నే మళ్ళీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోయినా ఈ సినిమాకు మహేష్ బాబు దాదాపు 60 కోట్ల వరకు బడ్జెట్ పెట్టనున్నారు.

అయితే కొరటాల శివ మెగా ఫ్యామిలీతో అలాగే నందమూరి ఫ్యామిలీతో కాస్త బిజీగా ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు ఆయన కోసం ఎదురు చూస్తున్నారని వచ్చే ఏడాది కచ్చితంగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని అయితే రాజమౌళి తో చేసే సినిమాకు సంబంధించి కాస్త దూకుడుగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కాస్త ఆలోచిస్తున్నారని అంటున్నారు. మరి ఆ భవిష్యత్తులో మహేష్ బాబు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: