పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు ఒకప్పుడు ఎదురుచూసిన పరిస్థితి ఉండేది అనే మాట వాస్తవం. చాలా వేగంగా సినిమా చేయడమే కాకుండా కథా అభిమానులకు దగ్గర అయ్యే విధంగా రాయడం అలాగే సినిమాలు మంచి హిట్ కొట్టడం లో పూరి జగన్నాథ్ దిట్ట అనే మాట వాస్తవం. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా సరే గతంలో కచ్చితంగా హిట్ కొట్టే వాళ్ళు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి పూరి జగన్నాథ్ తెలుగు సినిమాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం.

కొన్ని కొన్ని కథలు ఆయన రాసిన సరే ఆ సినిమాలు విజయం సాధించగా ఆయన కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది అర్థం అవుతుంది. బాలకృష్ణతో ఆయన తెరకెక్కించిన పైసా వసూల్ సినిమా మంచి విజయం సాధించడంతో మరోసారి బాలకృష్ణ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ తో సినిమా చేస్తానని గతంలో పూరీ జగన్నాథ్ చెప్పారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కొబ్బరికాయ కొట్టే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

పూరి జగన్నాథ్ కూడా బాలకృష్ణ కు తగిన విధంగా ఒక కథ రెడీ చేశారని అయితే ఈ కథ కాస్త భిన్నంగా ఉంటుందని కుటుంబ నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు పూరి జగన్నాథ్ సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి నందమూరి బాలకృష్ణ కొన్ని మార్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే కాస్త ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ కొంతమంది యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం పట్ల అందరూ కూడా ఆసక్తికరంగా ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: