నిజంగా ఆత్మలు ఉన్నాయా లేవా అన్న విషయం పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ విషయమై ఇప్పటికీ ఎవరు స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అయితే ఆత్మఘోషలు దెయ్యాలు కథాంశంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నవలలు మరెన్నో సినిమాలు కొన్ని దశాబ్ధాలుగా వస్తూనే ఉన్నాయి. హేతువాదులు ఆత్మలు లేవు దెయ్యాలు లేవు అని అనేకసార్లు నిరూపించినప్పటికీ జనం ఇప్పటికీ ఎంతోకొంత దెయ్యాలను నమ్ముతూనే ఉన్నారు.


అల్లరి నరేష్ ‘సీమటపాకాయ్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ కెరియర్ పరంగా పెద్దగా ఎదగలేకపోయింది. ప్రస్తుతం ఛానల్స్ లో ప్రసారం అవుతున్న డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణకు 'అఖండ’ మూవీ ఊహించని మలుపు ఇచ్చింది. దీనితో ఇప్పుడు అయినా తనకు సినిమాలలో మంచి అవకాశాలు వస్తాయేమో అన్న ఆశతో పూర్ణ ఎదురు చూస్తోంది.


ఈమధ్య 'అఖండ’ విడుదల సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను గతంలో దెయ్యంతో పడిన బాధను వివరించింది. గతంలో తాను రవికుమార్ దర్శకత్వంలో ‘అవును’ సినిమాలో నటిస్తున్నప్పుడు తాను పడుకున్నప్పుడు అదేవిధంగా బాతృమ్ లో స్నానం చేస్తున్నప్పుడు తన పక్కనే దెయ్యం ఉన్నట్లుగా భావించి నటించవలసి వచ్చిందని అయితే ఆమూవీ విడుదల అయ్యాక కూడ ఆ భావన తన మైండ్ లో పూర్తిగా ట్యూన్ అవ్వడంతో తాను పడిన పాట్లు వివరించింది.


మూవీ విడుదల అయ్యాక తాను ఎక్కడకు వెళ్ళినా తనను ఎవరో అజ్ఞాత వ్యక్తి వెంటాడుతున్నట్లు ఫీలింగ్ కలగడమే కాకుండా తన రూమ్ లో పడుకున్నప్పుడు కొన్ని గంటలకు ఎవరో గట్టిగా తట్టి లేపినట్లు ఫీలింగ్ కలగడంతో తాను చాల ఇబ్బంది పడ్డానని ఈ కన్నడ బ్యూటీ వివరించింది. అయితే ఈభయం ఎప్పటికీ తగ్గక పోవడంతో తాను ఒక సైక్రియాటిస్ట్ ను కలిసి తన భయాలను వివరించి అప్పట్లో కౌన్సిలింగ్ తీసుకున్నాను అంటూ వివరించింది. ఇప్పటికైనా పూర్ణ దెయ్యం భయాలు తొలిగిపోయాయి కాబట్టి ఆమెకు ‘అఖండ’ తరువాత మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: