లవ్ స్టోరీ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్ సాధించుకున్న అక్కినేని నాగచైతన్య ఇప్పుడు రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. తండ్రి నాగార్జునతో కలిసి ఆయన బంగార్రాజు అనే సినిమా చేస్తుండగా మరొకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే ఓ విభిన్న కథా చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రెండు వేరు వేరు జోనర్ లకు సంబంధించిన సినిమాలు కావడం విశేషం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య మాస్ పాత్ర చేస్తుండగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య క్లాస్ పాత్ర పోషిస్తూ తనలోని వేరియేషన్స్ చూపిస్తున్నాడు.

ఇకపోతే నాగచైతన్య ఇప్పుడు ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసే స్థాయికి రావడంతో తన తదుపరి చిత్రాల గురించి అన్వేషణ మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని కథలు వింటున్నాడు. వీటిలో రెండు సినిమాలను ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. వాటికి దర్శకులు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించే సినిమాలు అని ఆయన భావిస్తున్నాడట. రెండు కూడా మంచి డిఫరెంట్ సినిమాలే అని తెలుస్తుంది. మరి నాగచైతన్య సినిమాలు ఎంపిక ఇటీవల మారిన నేపథ్యంలో ఈ చిత్రాలు ఏ విధంగా ఉంటాయో అనేది చూడాలి.

ఇకపోతే ఆయన ఓ వెబ్ సిరీస్ ను కూడా చేస్తున్నారనే వార్తలు ఆ మధ్య తెగ సర్క్యులేట్ అయ్యాయి. ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో ఓ టీ టీ లు కూడా చాలా అభివృద్ధి చెందాయి. మెజారిటీ ప్రేక్షకులు ఓటీ టీ లోని సినిమాలను చూస్తారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అలరించే విధంగా నాగచైతన్య అక్కడ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఇది ఉందో లేదో అన్న అనుమానాలను ఎక్కువ చేస్తున్నాయి. ఏదేమైనా ఒక సినిమా సెట్స్ మీద ఉంటే మరొక సినిమా చేయడానికి ఆలోచించే నాగచైతన్య తాను నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూడు సినిమాలను ఒప్పుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: